విశాఖ : .. పట్టుబిగిస్తున్న .. భారత్..

Navyamedia

Navyamedia

Author 2019-10-04 10:30:12

img

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్ట్‌లో భారత్‌ పట్టు బిగిస్తోంది. మూడోరోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో ఎల్గార్‌(160), డికాక్‌(111), కెప్టెన్‌ డుప్లెసిస్‌(55) రాణించారు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టుకు బవుమా(18) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. అనంతరం ఎల్గార్‌-డుప్లెసిస్‌ల జోడీ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రవిచంద్రన్‌ అశ్విన్‌ విడదీశాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడటానికి ప్రయత్నించిన డుప్లెసిస్‌ లెగ్‌స్లిప్‌లో ఉన్న పుజరాకు క్యాచ్‌ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. దీంతో 178 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా 5 వికెట్లను కోల్పోయింది. ఓ దశలో భారత్‌పై పైచేయి సాధించేలా కనిపించినా స్పిన్నర్ల దెబ్బకు సఫారీ జట్టు ఒక్కసారిగా వెనుకబడిపోయింది. దక్షిణాఫ్రికా జట్టు 178 పరుగులకే 5వ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చిన వికెట్‌ కీపర్‌ డికాక్‌-ఎల్గార్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నిల్మించాడు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్‌కు ఏకంగా 164 పరుగులు జతచేశారు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్నంతసేపు చూడముచ్చటైన షాట్లతో ప్రేక్షకులను అలరించారు. ఈ దశలోనే ఎల్గర్‌ కూడా శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

డికాక్‌ కూడా తనదైన శైలిలో చెలరేగడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. కానీ ఎల్గార్‌ను జడేజా బోల్తా కొట్టించి వీరిద్దరి భాగస్వామ్యానికి తెరదించాడు. ఎల్గార్‌ ఔటైన కొద్దిసేపటికే డికాక్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది శతకాన్ని అందుకున్నాడు. తర్వాత డికాక్‌ను అశ్విన్‌ అద్భుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. డికాక్‌ ఔటవ్వడంతో దక్షిణాఫ్రికా ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఫిలాండర్‌ను అశ్విన్‌ ఒక గుడ్‌లెంగ్త్‌ బంతితో బోల్తా కొట్టించాడు. ఆఖరి సెషన్‌లో సఫారీలు మూడు వికెట్లు కోల్పోయింది. శుక్రవారం ఆట నిలిచిపోయే సమయానికి ముత్తుసామి(12), మహారాజ్‌(3) క్రీజ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టు శనివారం మరో 15 పరుగులు జతచేస్తే 2013 తర్వాత భారత్‌లో రెండవసారి బ్యాటింగ్‌ చేస్తూ 400 పైచిలుకు పరుగులు చేసిన జట్టుగా రికార్డు నిలకొల్పనుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌ చేస్తే… ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ చేస్తూ మరే జట్టు ఇంతవరకూ 400కు పైగా పరుగులు చేసిన దాఖలాలు లేవు. రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఐదు, జడేజాకు రెండు, షాంత్‌కు ఒక వికెట్‌ లభించాయి.READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN