వెళ్లు సంజూ.. అదరగొట్టు : గంభీర్

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-26 00:55:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్‌కు యువ ఆటగాడు సంజూ శాంసన్ ఎంపిక కావడంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంబీర్ హర్షం వ్యక్తం చేశాడు. అతడు జట్టుకు చాలా బాకీ ఉన్నాడని పేర్కొ న్నాడు. అతడు టీమిండియాకు ఎప్పు డో ఎంపిక కావాల్సిందని వెల్లడించా డు. బంగ్లాదేశ్‌తో నవంబర్ 3 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానున్న సంగ తి తెలిసిందే. ఈ సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు మరో యువ ఆటగాడు శివమ్ దూబేకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ‘సంజూ శాంసన్‌కు అభినందనలు. లాఘవమె న చేతులు, చురుకైన పాదాలు, స్థిరమైన బుర్ర. వెళ్లు సంజూ, వెళ్లి నీ అవకాశాన్ని అందిపుచ్చుకో. బాకీ చాలా ఉన్నావ్’ అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు. సంజూ 19 ఏళ్లలోనే భారత్ తరఫున టీ20ల్లో ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఫాం లేమీతో జట్టుకు దూ రమయ్యాడు. తిరిగి దేశవాళీ, భార త్-ఏ తరఫున రాణించి బంగ్లా సిరీస్ కు ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలోనూ సంజూ 212 (నాటౌట్)తో అదరగొట్టాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD