వేణు మాధవ్ మృతి పట్ల క్రికెటర్ సంతాపం

Telugu Movies

Telugu Movies

Author 2019-09-27 16:45:00

img
అనారోగ్యంతో హాస్యనటుడు వేణు మాధవ్ బుధవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. మౌలాలి హౌజింగ్‌ బోర్డ్‌ లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో వేణుమాధవ్‌ దహన సంస్కారాలు నిర్వహించారు. వేణుమాధవ్‌ పెద్ద కుమారుడు చితికి నిప్పంటించాడు. వేణు మాధవ్ అంత్యక్రియలు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తన ట్విట్టర్ ద్వారా వేణు మాధవ్ మృతికి సంతాపం తెలియజేయడం విశేషం. ‘వేణు మాధవ్ చనిపోయారనే వార్త నన్ను షాక్‌కి గురి చేసింది. సిల్వర్ స్క్రీన్‌పై నేను చూసిన అద్భుత కమెడీయన్స్‌లో ఆయన ఒకరు. అతనిని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఆయనకి నా నివాళులు. కుటుంబ సభ్యులకి, మిత్రులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’నని యూసఫ్ ట్విట్ చేశారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD