వేదిక మార్చేది లేదు..

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-01 06:32:06

  • ఢిల్లీలోనే తొలి టీ20

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సహజంగా ఉండే వాయు కాలుష్యానికి తోడు దీపావళి తర్వాత వీటి ప్రమాణాలు మరింత ప్రమాదకర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో స్థానిక అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరగాల్సిన తొలి టీ20పై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలువురు పర్యావరణవేత్తలు ఈ వేదికను మార్చాలని బీసీసీఐకి లేఖ కూడా రాయగా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అటు గత మూడు రోజులుగా ఇక్కడి వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) అతి ప్రమాదకర స్థాయిని చూపుతోంది. గురువారం స్టేడియం పరిసరాల్లో ఏక్యూఐ 438గా ఉంది. లెక్క ప్రకారం 401-500గా ఉంటే అతి ప్రమాదకర స్థాయిగా భావిస్తారు.

షెడ్యూల్‌ ప్రకారమే: గంగూలీ

వాయు కాలుష్యం ఎలా ఉన్నా మ్యాచ్‌ నిర్వహణపై బీసీసీఐ కృతనిశ్చయంతో ఉంది. ఇదే విషయమై కొనసాగుతున్న ఊహాగానాలకు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెర దించాడు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌ సాగుతుందని స్పష్టం చేశాడు. ‘కచ్చితంగా ఈ మ్యాచ్‌ ఢిల్లీలోనే జరుగుతుంది’ అని దాదా తేల్చాడు. అటు ఢిల్లీ క్రికెట్‌ సంఘం కూడా మ్యాచ్‌పై సానుకూలంగానే స్పందించింది. బోర్డు నుంచి తమకు వేదిక మార్పు గురించి సమాచారం లేదని, బ్రాడ్‌కాస్టర్స్‌ కూడా ఢిల్లీ చేరుకున్నారని డీడీసీఏ అధికారి ఒకరు తెలిపారు.

మాస్క్‌తో ప్రాక్టీస్‌

భారత్‌తో ఆదివారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌ కోసం బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ ఆరంభించారు. అయితే వాయు కాలుష్యం కారణంగా బంగ్లా బ్యాట్స్‌మన్‌ లిటన్‌ దాస్‌ కొంతసేపు మాస్క్‌ను ధరించి ఫీల్డింగ్‌ ప్రాక్టీ్‌సను కొనసాగించాడు. అయితే బ్యాటింగ్‌ సమయంలో మాత్రం మాస్క్‌ లేకుండానే ఆడాడు. ఇక మిగతా ఆటగాళ్లు మాత్రం ఎలాంటి మాస్క్‌లూ ధరించలేదు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD