వైజాగ్‌ టెస్టు: టీమిండియా ఘన విజయం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-06 16:54:29

img

వైజాగ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 11/1 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు.. 191 పరుగుల దగ్గర ఆలౌట్ అయ్యారు. దీంతో 203 పరుగుల భారీ విజయం భారత జట్టుకు దక్కింది. టీమిండియా విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఐదో రోజు షమి, జడేజా బౌలింగ్ దాటికి సఫారీలు విలవిల్లాడిపోయారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌‌ను 502/7 దగ్గర డిక్లేర్డ్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌‌ను 323/4 దగ్గర డిక్లేర్డ్‌ చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌లో 431 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్‌‌లో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN