శాంసన్‌ రికార్డు డబుల్‌ సెంచరీ

Prajasakti

Prajasakti

Author 2019-10-13 04:53:27

img

- 129 బంతుల్లోనే 212 పరుగులు
బెంగళూరు : విజయ్‌ హజారే ట్రోఫీలో కేరళ వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌ రికార్డు డబుల్‌ సెంచరీని నమోదు చేశాడు. శనివారం గోవాతో వన్డే మ్యాచ్‌ ఆడుతూ కేవలం 129 బంతుల్లోనే 20 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో అజేయంగా 212 పరుగులు చేశాడు. దీంతో ప్రొఫెషనల్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తక్కువ బంతుల్లో డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా సంజు రికార్డు పుటల్లోకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌ ఆటగాడు అబిద్‌ అలీ(209నాటౌట్‌) పేరిట ఉండగా... గత సీజన్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన కౌశల్‌ 202 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సచిన్‌ బేబీ(127)కూడా కదం తొక్కడంగా కేరళ 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 377 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. అనంతరం గోవా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 273 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని చవిచూసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN