శాంసన్‌ రికార్డు డబుల్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-13 06:52:01

img

బెంగళూరు: కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో డబుల్‌ సెంచరీ బాది రికార్డులు బద్దలుకొట్టాడు. హజారే ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో శాంసన్‌ 129 బంతుల్లో 20 ఫోర్లు, 10 సిక్సర్లతో 212 పరుగులతో అజేయ ద్విశతకం నమోదు చేశాడు. దీంతో లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో వేగవంతమైన డబుల్‌ సెంచరీ (125 బంతుల్లో) సాధించిన తొలి భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా సంజూ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఓవరాల్‌ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్‌ హెడ్‌ (120 బంతుల్లో) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక, లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో సచిన్‌, సెహ్వాగ్‌, రోహిత్‌, ధవన్‌, కర్ణ్‌ కౌశల్‌ తర్వాత డబుల్‌ సెంచరీ సాధించిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో ఈ ఫీట్‌ సాధించిన మూడో క్రికెటర్‌గా, తొలి మూడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గానూ నిలిచాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేరళ.. శాంసన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 377/3 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్‌ బేబి (127)తో కలిసి మూడో వికెట్‌కు 338 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శాంసన్‌.. 25 ఏళ్లనాటి రికార్డును కూడా బద్దలుకొట్టాడు. ఇంతకుముందు వార్విక్‌ షైర్‌ తరఫున టిమ్‌ కర్టి్‌స-టామ్‌ మూడీ మూడో వికెట్‌కు 309 పరుగుల పార్ట్‌నర్‌షి్‌పను సంజూ-సచిన్‌ జోడీ బ్రేక్‌ చేసింది. ఛేదనలో గోవా ఓవర్లన్నీ ఆడి 273/8 స్కోరుకే పరిమితమై 104 పరుగుల తేడాతో ఓడింది. హజారే ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కూడా సంజూదే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN