శాశ్వత వేదికలుంటే మంచిదే

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-27 05:41:13

img

కోహ్లీతో ఏకీభవించిన కుంబ్లే

టెస్టు మ్యాచ్‌ల ఆదరణకు దేశంలో ఐదు వేదికలు సరిపోతాయన్న కోహ్లీ అభి ప్రాయంతో మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే ఏకీభ వించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రాంచీ టెస్టుకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కనిపించలేదు. ఇలాంటి చోట్ల టెస్టులను జరిపితే ప్రయోజనముండదని మ్యాచ్‌ ముగిశాక కోహ్లీ వ్యాఖ్యానించాడు. అయితే 80, 90వ దశకాల్లో ఆయా పండుగల సమయాల్లోనే టెస్టులను నిర్వహించేవారని కుంబ్లే గుర్తుచేశాడు. ‘టెస్టు మ్యాచ్‌లకు ఆదరణ పెంచాలంటే వేదికలను తగ్గించడంతో పాటు నిర్వహణ సమయం కూడా కీలకమే. అప్పట్లో సంక్రాంతి సమయంలో చెన్నైలో టెస్టులు జరిపేవారు. సీజన్‌ ఆరంభంలో ఢిల్లీ, బెంగళూరు ఆ తర్వాత ముంబై, కోల్‌కతాలో మ్యాచ్‌లు నిర్వహించాలి. ముందుగానే ఎక్కడెక్కడ మ్యాచ్‌లు జరుగుతాయో తెలిస్తే సరైన మార్కెటింగ్‌తో ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించవచ్చు’ అని కుంబ్లే వివరించాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD