శిక్షణ పొందుతున్న షూటర్ల మధ్య గొడవ
న్యూఢిల్లీ: డా|| కర్ని సింగ్ షూటింగ్ రేంజ్ శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతూ గొడవపడ్డ ఇద్దరు షూటర్ల సభ్యత్వాలను రద్దు చేశారు. శిక్షణలో ఉన్న బాబర్ ఖాన్ మరియు యోగిందర్పాల్ సింగ్ ముష్టిఘాతాలతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఇన్ఛార్జి మాజీ షూటర్ మొరాద్ అలీఖాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వీరిపై చర్యలు తీసుకున్నారు. సోమవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సారు) వీరిద్దరి సభ్యత్వాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు గొడవపడిన ఇద్దరు షూటర్లపై నేషనల్ రైఫల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విచారణకు ఆదేశించింది.