శివమెత్తిన శ్రేయాస్ అయ్యర్.. కురిసిన సిక్సర్ల వర్షం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-10 22:52:29

img

నాగ్‌పూర్: బంగ్లాదేశ్ బౌలర్లకు శ్రేయాస్ అయ్యర్ చుక్కలు చూపిస్తున్నాడు. రాహుల్ క్రీజులో ఉన్నంత వరకు ఆచితూడి ఆడిన శ్రేయాస్.. అతడు అవుటవగానే శివమెత్తాడు. అఫిఫ్ హొసైన్ బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తొలి మూడు బంతులను స్టాండ్స్‌లోకి పంపి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కేవలం 27 బంతుల్లోనే 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో టీ20ల్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడు పరుగుల వద్దే రోహిత్‌ను అవుట్ చేసిన ఆనందం బంగ్లాదేశ్‌కు మిగల్చకుండా శ్రేయాస్ చెలరేగిపోయాడు. 35 పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో ధవన్ అవుట్ కాగా, అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న వెంటనే లోకేశ్ రాహుల్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 58, రిషభ్ పంత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN