శ్రీశాంత్ ఘాటు వ్యాఖ్యలపై స్పందించిన దినేశ్ కార్తీక్

Nava Telangana

Nava Telangana

Author 2019-10-23 09:21:00

చెన్నై: టీం ఇండియాలో తనకు చోటు దక్కకపోవడానికి జట్టు వికెట్‌ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ కారణం అంటూ పేస్ బౌలర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. కార్తీక్ వల్ల తన కెరీర్ నాశనం అయిందంటూ శ్రీశాంత్ పరోక్షంగా అన్నాడు. అంతేకాక.. కేరళ, తమిళనాడు మధ్య జరిగే మ్యాచ్‌లో కార్తీక్‌ను ఏం చేస్తానో చూడు అంటూ సవాల్ కూడా విసిరాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కార్తీక్ స్పందించాడు. టీం ఇండియా నుంచి తను బయటకు రావడానికి నేనే కారణం అంటూ ఎస్.శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు నేను విన్నాను. అటువంటి ఆరోపణపై మాట్లాడటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అని కార్తీక్ పేర్కొన్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN