షకిబ్‌పై నిషేధానికి సిద్ధమైన ఐసీసీ?

Nava Telangana

Nava Telangana

Author 2019-10-29 16:33:00

ఢాకా: బంగ్లాదేశ్‌ టీ20, టెస్టు సారథి షకిబ్‌ అల్‌ హసన్‌ టీమిండియాతో సిరీసుల్లో ఆడటం అనుమానమే! ఐసీసీ ఆజ్ఞల మేరకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అతడిని క్రికెట్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. కనీసం సాధన సైతం చేయనీయడం లేదు. ఓ అవినీతి పరుడు అతడిని సంప్రదించిన విషయం ఐసీసీకి వెల్లడించలేదని ఓ పత్రిక ప్రచురించడమే ఇందుకు కారణం.ఆరోపణలు నిజమైతే దాదాపు 18 నెలలు షకిబ్‌పై ఐసీసీ నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు తోడు బీసీబీకి ఇదో అదనపు సమస్యగా మారింది. నవంబర్‌ 3 నుంచే భారత పర్యటన మొదలవ్వనుంది. ఐసీసీ ఆదేశాల మేరకే షకిబ్‌ను బీసీబీ సాధనకు దూరంగా ఉంచింది. సన్నాహక మ్యాచుల్లో ఆడకపోవడానికి, డే/నైట్‌ టెస్టుపై సమావేశానికి ఆలస్యంగా రావడానికి ఇదే కారణం అని సమకాల్‌ పత్రిక రాసింది. ప్రస్తుతానికి షకిబ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేయడానికి ఐసీసీ నిరాకరిస్తోంది.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD