షకీబ్‌కు బుకీ వాట్సాప్ మెసేజ్‌లు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-31 03:00:08

img

దుబాయ్, అక్టోబర్ 30: ప్రపంచ క్రికెట్‌లో మరోసారి కలకలం రేపిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ వివా దంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. తనను సం ప్రదించిన భారత బుకీ దీపక్ అగర్వాల్ ఓ వ్యక్తి ద్వారా షకీబ్ ఫోన్ నెంబర్ తీసుకొని పలుసార్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసినట్లు తెలిసింది. 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) సందర్భంగా నవంబర్‌లో తొలిసారి సంప్రదించగా.. తర్వాత 2018 జనవరిలో, ఏప్రిల్‌లో మరోసారి సంప్రదించాడు. ఈ విషయాలను బంగ్లా ఆల్‌రౌండర్ ఎవరికీ చెప్పలేదు. కానీ, ఇటీ వల ఐసీసీ విచారణ అధికారుల వద్ద తన నేరాన్ని అంగీకరిం చడంతో ఐసీసీ అతడిపై నిషేధం విధించింది. బీపీఎల్ తర్వాత 2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య ట్రై సిరీస్‌లోనూ బుకీ షకీబ్‌ను సంప్రదించాడు. ఈ సిరీస్‌కు ఎంపి కైనందుకు షకీబ్‌కు అభినందనులు తెలుపుతూ జనవరి 19న దీపక్ మెసేజ్ చేయడమే కాకుండా ‘ఐపీఎల్ వరకు వేచి చూద్దామా’ అంటూ ఆ సందేశంలో పేర్కొన్నాడు. బంగ్లా జట్టు అంతర్గత ప్రణాళిక సమాచారాన్ని తెలుకోవడమనే అర్థంలో ఐసీసీ విచారణ అధికారులు భావించారు. అలాగే జనవరి 23న ‘బ్రో ఈ సిరీస్‌లో ఏమైనా ఉందా?’ అంటూ మరోసారి మెసేజ్ చేశాడు. ఇక ఐపీఎల్ సందర్భంగా ఏప్రిల్ 26న సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించి సమాచారం ఇవ్వాలని మరోసారి అడి గాడు. ఈ సందర్భంగా వారి మధ్య బిట్ కాయన్స్, డాలర్ అకౌంట్స్ సమాచారంపై సంభాషణలు జరిగాయ. అయతే షకీ బ్ మాత్రం దీపక్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు ఆసక్తి చూపిం చాడు. అప్పుడు జరిగిన సంభాషణ మొత్తం డిలీట్ అయందని, అందులో జట్టు అంతర్గత సమాచారం ఇవ్వాలని దీపక్ కోరిన ట్లు షకీబ్ విచారణ అధికారుల వద్ద అంగీకరించాడు.
*చిత్రం... బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD