షాబాజ్‌ @ 296

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-20 06:31:20

img

జార్ఖండ్‌ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌కు సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో చోటు లభించింది. దాంతో భారత్‌ తరపున టెస్ట్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన 296వ ఆటగాడిగా అతడు నిలిచాడు. 30 ఏళ్ల నదీమ్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చాడు. గత ఏడాది అక్టోబరులో వెస్టిండీ్‌సతో టీ20 సిరీ్‌సకు షాబాజ్‌ టీమిండియాకు ఎంపికైనా తుది జట్టులో స్థానం దక్కలేదు. కాగా 2019లో భారత్‌ తరపున టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన తొలి ఆటగాడు షాబాజే కావడం విశేషం. 2018లో జస్‌ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్‌, హనుమ విహారి, పృథ్వీషా, శార్దూల్‌ ఠాకూర్‌, మయాంక్‌ అగర్వాల్‌ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD