షూటింగ్‌లో మరో ఒలింపిక్‌ బెర్త్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-09 06:13:54

దోహా: భారత యువ షూటర్‌ చింకీ యాదవ్‌ ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రదర్శన చేసి భారత్‌కు టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ అందించింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ క్వాలిఫి కేషన్స్‌లో చింకీ 588 స్కోరు చేసి రెండోస్థానంలో నిలిచింది. దీంతో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ కేటగిరీ నుంచి భారత్‌కు రెండో ఒలింపిక్‌ కోటా లభించింది. ఈ విభాగం నుంచి ఇప్పటికే రాహీ సర్నోబాత్‌ ఒక ఒలింపిక్‌ బెర్త్‌ను అందించిన సంగతి తెలిసిందే. కాగా.. క్వాలిఫికేషన్స్‌లో అదరగొట్టిన చింకీ.. ఫైనల్స్‌లో మాత్రం ఆరోస్థానంలో నిలిచి పతకం నెగ్గడంలో విఫలమైంది. భోపాల్‌లోని ప్రభుత్వ క్రీడా కార్యాలయంలో పనిచేస్తున్న ఎలక్ర్టీషియన్‌ కూతురైన 21 ఏళ్ల చింకీ.. మాజీ షూటర్‌ జస్పాల్‌ రాణా వద్ద కోచింగ్‌ తీసుకుంటోంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD