సచిన్‌, సెహ్వాగ్‌ల తర్వాత రోహిత్‌..

Nava Telangana

Nava Telangana

Author 2019-10-20 15:56:00

హైదరాబాద్ : టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో, వన్డేల్లో డబుల్‌ సెంచరీలు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన నాల్గో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. భారత్‌ తరఫున సచిన్‌, సెహ్వాగ్‌లు మాత్రమే రెండు ఫార్మాట్లలో డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాళ్లు. ఇక వెస్టిండీస్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ కూడా టెస్టు, వన్డే ఫార్మాట్‌లో సెంచరీలు సాధించాడు. రోహిత్‌ శర్మ వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించగా, తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ ఫార్మాట్‌లో తొలి వ్యక్తిగత ద్విశతకం నమోదు చేశాడు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD