సన్నాహక మ్యాచ్‌ డ్రా

Prajasakti

Prajasakti

Author 2019-09-29 06:51:00

img

- దక్షిణాఫ్రికా 279/6 డిక్లేర్డ్‌
- బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవెన్‌ 268/8
- అర్ధసెంచరీలు చేసిన భరత్‌, పంచల్‌, సిద్దేస్‌ లాడ్‌
ప్రజాశక్తి - విజయనగరంటౌన్‌
విజయనగరంలోని చింతవలస పివిజిరాజు ఎసిఎ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవెన్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సన్నాహక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మూడు రోజుల మ్యాచ్‌లో భాగంగా తొలి రోజు ఆటగ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో మిగిలిన రెండు రోజులు ఆట మాత్రమే కొనసాగింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 4 వికెట్ల నష్టానికి 199 పరుగులతో శనివారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 279 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టు చివరిరోజు ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. శ్రీకర్‌ భరత్‌ 71 పరుగులు, ప్రియాంక్‌ పంచల్‌ 60 పరుగులు, సిద్దేస్‌లాడ్‌ 52 పరుగులు చేశారు. వీరు ముగ్గురూ అర్ధ సెంచరీలు చేయడం విశేషం. సాయంత్రం ఐదు గంటలు సమయానికి 64 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి బోర్డు ఎలెవెన్‌ జట్టు 268 పరుగులు చేయగా ఆంపైర్లు 64వ ఓవర్‌ పూర్తయిన వెంటనే ఆటను నిలిపివేశారు.
అంతకుముందు 279 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా జట్టులో మర్కరమ్‌ వంద పరుగులు చేయగా, ఎల్గర్‌ 6, బ్రూన్‌ 6, హామ్జా 22, బవుమా 87 పరుగులు, డూప్లెసెస్‌ 9, ఫిలాండర్‌ 48 పరుగులు చేశారు. ఇండియా బౌలర్లలో ఉమేష్‌యాదవ్‌ 11 ఓవర్లు వేసి ఒక వికెట్‌ తీశాడు. ఎస్‌ఎన్‌ .ఠాకూర్‌ 13 ఓవర్లు చేసి 47 పరుగులు, అవీష్‌ఖాన్‌ 12 ఓవర్లకు 51 పరుగులు, జలజ్‌ సెక్సెనా 8 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చారు. ఇషాన్‌ పోరెల్‌ 8 ఓవర్లు వేసి ఒక వికెట్‌ తీయగా, జడేజా 12 ఓవర్లు వేసి మూడు వికెట్లు తీశారు. ఇక బోర్డు ప్రెసిడెంట్‌ జట్టులో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 39 పరుగులు చేయగా, కెప్టెన్‌ రోహిత్‌శర్మ డౌకౌట్‌ అయ్యాడు. అభిమన్యు 13, పంచాల్‌ 60 పరుగులు, నాయర్‌ 19, సిద్దేశ్‌ లాడ్‌ 52, శ్రీకర్‌ భరత్‌ 71, జలజ్‌ సక్సేనా రెండు పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాగిశో రభడ 9.5 ఓవర్లు వేసి ఒక వికెట్‌, ఫిలాండర్‌ 9 ఓవర్లు వేసి రెండు వికెట్లు, కె.మహారాజ్‌ 13.3 ఓవర్లు వేసి మూడు వికెట్లు, నగ్డి ఎనిమిది ఓవర్లు, నార్ట్‌జే తొమ్మిది ఓవర్లు, డేన్‌పీడిట్‌ 14 ఓవర్లు వేసి ఒక వికెట్‌, సేనుర్న ముత్తుషా ఒక ఓవర్‌ వేసి ఒక వికెట్‌ తీసుకున్నారు.
నిరాశపర్చిన రోహిత్‌
బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా దిగి నిరాశపరిచాడు. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ ఆడిన రెండో బంతికే డకౌటయ్యాడు. టెస్టు ఫార్మాట్‌లో ఇప్పటివరకూ ఓపెనర్‌గా బరిలోకి దిగని రోహిత్‌ శర్మ ఎర్రబంతి క్రికెట్‌లో తన అదృష్టాన్ని ఓపెనర్‌గా పరీక్షించుకునే క్రమంలో ఆదిలోనే చుక్కెదురైంది. మూడోరోజు ఆటలో భాగంగా బోర్డు ప్రెసిడెంట్స్‌ బ్యాటింగ్‌కు దిగగా ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌లు ఆరంభించారు. ఫిలిండర్‌ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.
సంక్షిప్త స్కోర్‌..
దక్షిణాఫ్రికా - 278/6డిక్లేర్డ్‌ (మక్రమ్‌ 100(నాటౌట్‌), బవుమా 87(నాటౌట్‌), ఫిలాండర్‌ 48, జడేజా 3/66)
బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవెన్‌ : 265/8 (పంచల్‌ 60, భరత్‌ 71, లాడ్‌ 52, మహరాజ్‌ 3/35, ఫిలాండర్‌ 2/27)

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN