సఫారీలపై శతకంతో విరాట్ కోహ్లీ రికార్డ్‌ల మోత

NewsDaily

NewsDaily

Author 2019-10-11 15:13:22

దక్షిణాఫ్రికాపై భారత్ గడ్డమీద ఎట్టకేలకి సెంచరీ మార్క్‌ని అందుకున్న విరాట్ కోహ్లీ.. దిగ్గజాల సరసన నిలిచాడు. శుక్రవారం తొలి సెషన్‌లో కోహ్లీ - రహానె జోడీ కనీసం సఫారీలకి ఒక్క వికెట్ కూడా ఇవ్వకుండా రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పింది.

imgThird party image reference

దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డ్‌ల్లో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం లంచ్ విరామానికి విరాట్ కోహ్లి (104 బ్యాటింగ్: 183 బంతుల్లో 16x4) శతకం బాదడంతో భారత్ జట్టు 356/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. విరాట్‌తో పాటు క్రీజులో అజింక్య రహానె (58 బ్యాటింగ్: 161 బంతుల్లో 8x4) ఉండగా.. ఈరోజు చివరి సెషన్‌‌లో ఆఖరి అరగంట వరకూ భారత్ జట్టు బ్యాటింగ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

పుణె టెస్టులో శతకం ద్వారా టెస్టు కెరీర్‌లో 26వ శతకం మార్క్‌ని అందుకున్న విరాట్ కోహ్లీ.. సొంతగడ్డపై ఎట్టకేలకి దక్షిణాఫ్రికాపై తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇక కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 19వ టెస్టు శతకంకాగా.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సరసన కోహ్లీ నిలిచాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక శతకాలు బాదిన బ్యాట్స్‌మెన్‌గా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 శతకాలతో నెం.1 స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ సంయుక్తంగా 19 శతకాలతో రెండో స్థానంలో నిలిచారు.

టెస్టుల్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 26వ టెస్టు శతకం అందుకున్న నాలుగో క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా.. రికార్డ్‌‌‌లో డాన్ బ్రాడ్‌మన్ 69 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (121 ఇన్నింగ్స్‌ల్లో) ఉండగా.. మూడులో సచిన్ టెండూల్కర్ (136), ఐదులో సునీల్ గవాస్కర్ (144), ఆరులో మాథ్యూ హెడెన్ (145) ఉన్నారు

పుణె టెస్టులో దక్షిణాఫ్రికాపై అజింక్య రహానెతో కలిసి నాలుగో వికెట్‌కి ఇప్పటికే అజేయంగా 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. 1996-97 నాటి ద్రవిడ్ -గంగూలీ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. అప్పట్లో ద్రవిడ్ - గంగూలీ జోడీ.. నాలుగో వికెట్‌కి 145 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక రికార్డ్‌లో వారి తర్వాత వీరేంద్ర సెహ్వాగ్- బద్రీనాథ్ 2009-10లో 136 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN