సఫారీ సిరీస్ నుంచి బుమ్రా ఔట్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-25 02:48:00

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో చతికిలపడి సిరీస్‌ను సమంగా ముగించిన టీమ్‌ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే నెల స్వదేశంలో సఫారీలతో జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. ఏడు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరం ఉండడంతో నవంబర్ 3 నుంచి 26 వరకు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్‌లకు కూడా బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బుమ్రా స్థానంలో ఉమేశ్‌ను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిందని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. బుమ్రా స్థానంలో వచ్చిన ఉమేశ్.. చివరగా గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆ డాడు. అనుభవం, స్వదేశం లో మంచి రి కార్డు ఉన్న నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ అతడి వైపే మొగ్గు చూపింది. సఫారీలతో టీమ్‌ఇండి యా తొలి టెస్టు విశాఖపట్నం (అక్టోబర్ 2-6)లో జరుగనుండగా.. పుణె(10-14), రాంచీ (19-23) తదుపరి రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD