సబ్ జూనియర్ క్రికెట్ చాంప్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

Nava Telangana

Nava Telangana

Author 2019-10-17 09:31:00

హైదరాబాద్: భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ క్రికెట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జట్టు సొంతం చేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జట్టు రెండు వికెట్ల తేడాతో ఎస్‌ఎస్‌జీఎఫ్ కంబైన్ డిస్టిక్ జట్టు పై విజ యం సాధించింది. బుధవారం జిల్లెలగుడ గ్లోబల్ స్కూల్ క్రికెట్ మైదా నంలో స్కూల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఫైనల్స్‌లో మేడ్చల్ జిల్లా జట్టు 88 పరుగులు చేసింది. మోక్షిత్ 23, యషాష్ 25 పరుగులు చేశారు. ఎస్‌ఎస్‌జీఎఫ్ కంబైన్ జట్టు 86 పరుగులు చేశారు. అం తారీ 8 పరుగులు ఇచ్చి మూడు వికెట్ల తీసుకున్నాడు. అనిరుద్ 6 పరుగులు ఇచ్చి రెండు వికెట్ల, యజ్ఞ 12 పరుగులు ఇచ్చి రెండు వికెట్ల తీసుకు న్నారు. విజేతలకు క్రెసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫహీమ్ ఉద్దీన్ ఖాజా ఫయాజ్ తదితరులు బహుమతులు అందజేశారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN