సమ్మె వీడిన బంగ్లా ఆటగాళ్లు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-25 06:09:00

భారత పర్యటనకు లైన్‌క్లియర్
img
ఢాకా : బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎట్టకేలకు సమ్మె విరమించడంతో భారత పర్యటనపై సందిగ్ధం వీడింది. వేతనాల పెంపు సహా అన్ని డిమాండ్లపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బోర్డు (బీసీబీ)తో దాదాపు రెండు గంటల పాటు ఆటగాళ్లు చర్చించారు. తమ డిమాండ్లకు బీసీబీ సానుకూలంగా స్పందించిందని, అందుకే సమ్మెను విరమిస్తున్నామని బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్.. చర్చల అనంతరం గురువారం ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించాడు. బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్, డైరెక్టర్లతో సమావేశం ఫలవంతంగా సాగింది. మా డిమాండ్లను వీలైనంత త్వరగా నెరవేరుస్తామని చెప్పా రు. వారి హామీ మేరకు మేము ఆడడం ప్రారంభిస్తున్నాం. ఎన్‌సీఎల్‌తో పాటు ట్రైనింగ్ క్యాంపులోనూ పాల్గొంటాం అని షకీబ్ చెప్పాడు. సమావేశంలో షకీబ్‌తో పాటు సీనియర్ ప్లేయర్లు ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, తమీమ్ ఇక్బాల్ ఉన్నారు. ఆటగాళ్లు ముందుగా 11 డిమాండ్లు చేయగా మరో రెండు జత చేశారు. బీసీబీ ఆదాయంలో ప్లేయర్లకు వాటా ఇవ్వాలని, మహిళా క్రికెటర్లకు కూడా సమాన వేతనం అమలు చేయాలని కోరారు. అయితే తాజా డిమాండ్లపై మా త్రం బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హామీ ఇవ్వలేదు. బంగ్లాదేశ్ జట్టు వచ్చే నెలలో భారత పర్యటనకు రానుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD