సహ యజమానిగా రానా

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-25 05:51:00

img
కోల్‌కతా : ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఆరో సీజన్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు అరంగేట్రం చేయనుంది. శుక్రవారం ఇక్కడ జరిగే మ్యాచ్‌లో మాజీ చాంపియన్ అట్లెటికో డీ కోల్‌కతా(ఏటీకే)ను హైదరాబాద్ తన తొలి పోరులో ఢీకొననుంది. మాజీ ఇంగ్లీష్ ప్లేయర్, సీనియర్ కోచ్ ఫిల్ బ్రౌన్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. డేవిసన్ రొగేరియో డిసిల్వా, గైల్స్ బర్నెస్ లాంటి విదేశీ స్టార్ ఆటగాళ్లు హైదరాబాద్ జట్టులో ఉన్నారు. అయితే స్పానిష్ స్టార్ ఆటగాడు నెస్టల్ గాడిలో తొలి 8 మ్యాచ్‌లకు దూరం కావడం కాస్త ఎదురుదెబ్బగా మారింది. గనీ నిగమ్, సహిల్ తవోరా, లాల్‌ధన్‌మావియా, దీపేందర్ నేగీ, అశీష్ రాయ్, తారిఫ్ అఖంద్ లాంటి ప్రతిభావంతులైన దేశీయ ఆటగాళ్లు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంగ్లీష్ ప్లేయర్ మాథ్యూ కిల్‌గలాన్, రఫా లోపేజ్ గేమేజ్ లాంటి ఆటగాళ్లతో డిఫెన్స్ పటిష్ఠంగా ఉంది. కాగా, హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు సహ యజమానుల జాబితాలో ప్రముఖ హీరో దగ్గుబాటి రానా చేరాడు. ఈ విషయాన్ని యాజమాన్యం గురువారం ప్రకటించింది. మరోవైపు కొచ్చి వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి సిటీ 1-0తో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD