సాకులు వెతికి మరీ వేటేశారు!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-28 05:46:26

img

  • మేనేజ్‌మెంట్‌, సెలెక్టర్లు మద్దతివ్వలేదు
  • అవకాశాలిచ్చుంటే మరో వరల్డ్‌కప్‌ ఆడేవాణ్ణి!
  • యువరాజ్‌ సింగ్‌ ఆవేదన

న్యూఢిల్లీ: చాలారోజులు జట్టులో చోటుకోసం ఎదురుచూసి చివరకు రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌.. తన వీడ్కోలు నిర్ణయం వెనక కారణాలను ఎట్టకేలకు బహిరంగపర్చాడు. చాలాసార్లు జట్టు మేనేజ్‌మెంట్‌ తనకు అండగా నిలబడలేదనీ.. సరైన సమయంలో అవకాశాలిచ్చి ఉంటే తాను అంత త్వరగా వీడ్కోలు చెప్పి ఉండేవాడిని కాదని ఓ జాతీయ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు. ‘2011 తర్వాత మరో ప్రపంచకప్‌ ఆడలేకపోవడం నన్ను చాలా బాధించే విషయం. జట్టు మేనేజ్‌మెంట్‌, సెలెక్టర్లు నాకు మద్దతిచ్చి ఉంటే మరో మెగా టోర్నీ ఆడి ఉండేవాడిని’ అని యువీ అన్నాడు.

తనకెవరూ గాడ్‌ఫాదర్‌ లేరనీ.. స్వయం ప్రతిభతోనే క్రికెట్‌లో ఎదిగానని చెప్పుకొచ్చాడు. ఓ దశలో యో-యో టెస్టు పాసైనా, తనను జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ‘2017 చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత జరిగిన 8-9 మ్యాచ్‌ల్లో నేను రెండుసార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచా. నాకప్పుడే గాయమైంది. అయితే ఆ తర్వాత జరిగే శ్రీలంకతో సిరీ్‌సకు సన్నద్ధంగా ఉండాలని మేనేజ్‌మెంట్‌ చెప్పింది. ఏమైందో ఏమో..యో-యో టెస్ట్‌లో పాల్గొనాలని చెప్పారు. 36 ఏళ్ల వయసులోనూ ఆ టెస్టును పాసయ్యాను. అయితే, ఆ వయసులో నేను ఆ టెస్టు పాసవుతానని ఊహించని మేనేజ్‌మెంట్‌.. నన్ను దేశవాళీ క్రికెట్‌ ఆడాలంటూ సాకు వెతికి మరీ నాపై వేటు వేశారు’ అని యువీ ఆవేదన వ్యక్తం చేశాడు. 15-16 సంవత్సరాలు దేశం తరపున ఆడిన సీనియర్‌ను నేను. నన్ను కూర్చోబెట్టి...నిన్ను ఫలానా కారణంవల్ల జట్టునుంచి తొలగిస్తున్నామని చెప్పొచ్చు. కానీ అలా చేయలేదు. నాకేకాదు...సెహ్వాగ్‌, జహీర్‌ ఖాన్‌లకు కూడా చెప్పలేదు.

రోహిత్‌కు టీ20 పగ్గాలివ్వాలి!

టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ నాయకత్వం వహించడం విరాట్‌ కోహ్లీకి భారంగా అనిపిస్తే.. టీ20 సారథ్యాన్ని రోహిత్‌ శర్మకు అప్పగిస్తే మంచిదని జట్టు మేనేజ్‌మెంట్‌కు యువరాజ్‌ సూచించాడు. ఐపీఎల్‌లో నా లుగుసార్లు ముంబై ఇండియన్స్‌ ను విజేతగా నిలిపిన అనుభవం రోహిత్‌కు ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN