సాత్విక్‌ జంటకు సిల్వర్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-10-29 03:38:03

-ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
పారిస్‌ : ఈ ఏడాది థారులాండ్‌ ఓపెన్‌ విజయంతో డబుల్స్‌ సర్క్యూట్‌లో ధనాధన్‌ జోరందుకున్న జోడీ సాత్విక్‌సాయి రాంకీ రెడ్డి, చిరాగ్‌ శెట్టి. గాయంతో కొన్ని టోర్నీలకు దూరమైన ఈ జంట తిరిగి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో బరిలోకి దిగింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ టైటిల్‌ పోరులో నిరాశపరిచింది. మెన్స్‌ డబుల్స్‌ వరల్డ్‌ నం.1 ఇండోనేషియా జోడీ కెవిన్‌ సంజయ, మార్కస్‌ గిడియన్‌ చేతిలో సాత్విక్‌, చిరాగ్‌ ఓటమిపాలయ్యారు. టాప్‌ జోడీకి గట్టి పోటీ ఇచ్చినా 18-21, 16-21తో వరుస గేముల్లో టైటిల్‌ను కోల్పోయారు. 35 నిమిషాల తుది పోరులో సాత్విక్‌, చిరాగ్‌ కీలక సందర్భాలను గెల్చుకోవటంలో తడబడ్డారు. 1983 తర్వాత ఓ భారత జోడీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెల్చుకునే ఘనత ముందు నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌ చివర్లో నిరాశపరిచారు. పార్థో గంగూలీ, విక్రమ్‌ సింగ్‌లు 1983లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచారు. 2012లో సైనా నెహ్వాల్‌, 2017లో కిదాంబి శ్రీకాంత్‌ సైతం ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లను భారత్‌ను తీసుకొచ్చారు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD