సాబా కరీంపై బిసిసిఐ సీరియస్‌!

Prajasakti

Prajasakti

Author 2019-11-01 03:26:06

img

న్యూఢిల్లీ : మహిళల క్రికెట్‌ జట్టు ఇన్‌ఛార్జి సాబా కరీం నిర్లక్ష్య వైఖరిపై బిసిసిఐ సీరియస్‌ అయ్యింది. వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన భారత మహిళాజట్టు సభ్యులకు రోజువారీ అలెవెన్స్‌(డిఏ) రూపంలో ఇవ్వాల్సిన నగదుపై సాబా కరీం అలసత్వం ప్రదర్శించడమే ఈ సీరియస్‌కు కారణం. భారత క్రికెట్‌ జట్ల ఫైనాన్షియల్‌ వ్యవహారాలన్నీ గత నెల 18 వరకూ వినోద్‌ రారు నేతృత్వంలోని క్రికెట్‌ పరిపాలక కమిటీ(సిఓఏ) చూసేది. అయితే బిసిసిఐ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో దాన్ని సాబా కరీంకు అప్పచెప్పింది. దీనిపై సెప్టెంబర్‌ 23వ తేదీనే కరీంకు మెయిల్‌ పంపారు. అయితే అక్టోబర్‌ 24వరకూ ఫైనాన్షియల్‌ వ్యవహారాలకు సంబంధించి సాబా కరీం ఏమీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే భారత మహిళా జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లడంతో నగదు సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని వెంటనే బిసిసిఐకు తెలియజేయడంతో కొత్త నియమించబడ్డ కార్యవర్గం జోక్యంతో డిఏను ఆగమేఘాలపై బదిలీ చేయాల్సివచ్చింది. విండీస్‌ పర్యటనలో భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD