సాహా ఔట్‌.. టీమిండియా 419/6

Nava Telangana

Nava Telangana

Author 2019-10-20 16:31:00

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. 104వ ఓవర్‌ వేసిన లిండే.. మూడో బంతికి సాహా(24; 42 బంతుల్లో 3x4)ను బౌల్డ్‌ చేశాడు. దీంతో 104 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. అంతకుముందు ఓపెనర్‌ రోహిత్‌శర్మ(212) ద్విశతకంతో చెలరేగగా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(115) శతకంతో రాణించాడు. శనివారం 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ ఆదుకొని నాలుగో వికెట్‌కు 267 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో శతకం చేశాక రహానె, ద్విశతకం చేశాక రోహిత్‌ పెవిలియన్‌ బాట పట్టారు. అనంతరం జడేజా(32), సాహా నిలకడగా ఆడుతున్న క్రమంలో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD