సాహా స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన సఫారీలు

NewsDaily

NewsDaily

Author 2019-10-13 13:39:33

22 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న సీనియర్ వికెట్ కీపర్ సాహా.. వరుస డైవ్ క్యాచ్‌లతో అదరగొడుతున్నాడు. రిషబ్ పంత్‌ని పక్కనపెట్టి విరాట్ కోహ్లీ అతనికి తుది జట్టులో చోటిచ్చిన విషయం తెలిసిందే.

imgThird party image reference

దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ సాహా అద్భుతరీతిలో డైవ్ క్యాచ్‌లను అందుకుంటున్నాడు. ఆటలో నాలుగో రోజైన ఆదివారం దక్షిణాఫ్రికా టీమ్ ఫాలోఆన్ ఆడుతుండగా.. ఉమేశ్ యాదవ్ విసిరిన బంతిని డిబ్రయిన్ (8: 18 బంతుల్లో 2x4) ఫైన్‌లెగ్ దిశగా హిట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి.. లెగ్ స్లిప్‌ దిశగా దూసుకెళ్లింది. దీంతో.. ఆ బంతి ఫోర్‌గా వెళ్తుందని అంతా ఊహించారు. కానీ.. లెగ్ సైడ్ అద్భుతంగా డైవ్ చేసిన సాహా.. ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో.. డిబ్రయిన్‌తో పాటు సఫారీ ఆటగాళ్లు నోరెళ్లబెట్టారు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ డిబ్రయిన్ క్యాచ్‌ని సాహా ఇలానే డైవ్ చేస్తూ అందుకున్నాడు. శనివారం ఉమేశ్ యాదవ్ విసిరిన బంతి డిబ్రయిన్ బ్యాట్ ఎడ్జ్ తాకి ఫస్ట్ స్లిప్‌లోకి వెళ్లగా.. డైవ్ చేస్తూ సాహా క్యాచ్ అందుకున్నాడు. దీంతో.. ఒకే మ్యాచ్‌లో ఒకే తరహలో డిబ్రయిన్ రెండు సార్లు ఔటయ్యాడు. ఆదివారం ఫాలోఆన్ ఆడుతున్న దక్షిణాఫ్రికా 14 ఓవర్లు ముగిసే సమయానికి ప్రస్తుతం 55/2తో నిలవగా.. ఆ జట్టు ఇంకా 271 పరుగులు భారత్ తొలి ఇన్నింగ్స్ కంటే వెనకబడి ఉంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN