సింధుకు ఎదురు దెబ్బ

Amaravatinews

Amaravatinews

Author 2019-09-25 09:30:09

img

Share this on WhatsApp

కోచ్‌ కిమ్‌ రాజీనామా
వ్యక్తిగత కారణాలతో నిర్ణయం
సమాచారం లేదన్న ‘బాయ్‌’
ఒలింపిక్‌ సన్నాహకాలపై ప్రభావం

హ్యున్‌తో చక్కటి అనుబంధం ఉంది. ఇప్పుడిక మళ్లీ కొత్తగా ప్రారంభించాలి. అయినా క్రీడాకారుల జీవితంలో ఇలాంటివి సహజమే. గోపీ సర్‌తో పాటు ‘బాయ్‌’ తగిన ప్రత్యామ్నాయం చూస్తారని ఆశిస్తున్నా. – సింధు

కిమ్‌ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాలని భావిస్తున్నాం. అయితే అది కూడా తాత్కాలికమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉంది. – గోపీచంద్‌

న్యూఢిల్లీ: కిమ్‌ జీ హ్యున్‌.. పీవీ సింధు ఇటీవల వరల్డ్‌ చాంపియన్‌గా ఆవిర్భవించడంలో ఈ మేటి బ్యాడ్మింటన్‌ కోచ్‌ పాత్ర అనన్య సామాన్యం. అయితే దక్షిణ కొరియాకు చెందిన 45 ఏళ్ల హ్యున్‌ భారత మహిళల సింగిల్స్‌ కోచ్‌ పదవికి గుడ్‌బై చెప్పింది. కిమ్‌ భర్త రిచీ మార్‌ కొద్దిరోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో ఆమె న్యూజిలాండ్‌ వెళ్లింది. ఈ ఏడాది ఆరంభంలోనే కిమ్‌ను మహిళా సిం గిల్స్‌ కోచ్‌గా ‘బాయ్‌’ నియమించింది. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో గత నెలలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షి్‌ప సందర్భంగా సింధు వెంట హ్యున్‌ కూడా ఉంది. ‘వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప సమయంలోనే కిమ్‌ భర్తకు బ్రె యిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. దాంతో కిమ్‌ న్యూజిలాండ్‌ వెళ్లింది. ఆయన కోలుకునేందుకు 4 నుంచి 6 నెలలు పడుతుంది’ అని జాతీయ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ వెల్లడించాడు. అయితే హ్యున్‌ రాజీనామాకు సంబంధించి తమకుగానీ, స్పోర్ట్స్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)కిగానీ సమాచారం లేదని బాయ్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ సింఘానియా చెప్పడం గమనార్హం. ‘భర్తకు బాగా లేకపోవడంతో కిమ్‌ వెళ్లిపోయిన విషయం తెలుసు. ఆమె రాజీనామా మాకుగానీ, సాయ్‌కుగానీ అందలేదు’ అని ఆయన తెలిపారు. ‘ఒలింపిక్స్‌కు కేవలం 10 నెలల సమయమే ఉంది. దాంతో కోచ్‌గా కొనసాగేందుకు అవకాశం ఉందో, లేదో తెలుసుకొనేందుకు కిమ్‌ను సంప్రదిస్తున్నాం’ అని సింఘానియా చెప్పారు. ‘ఆమె నేతృత్వంలోనే సింధు వరల్డ్‌ టైటిల్‌ సాధించింది. ఒలింపిక్స్‌లోనూ సింధు సత్తా చాటాలంటే హ్యున్‌ కోచ్‌గా ఉండడం ఎంతో ముఖ్యం’ అని ఆయన అన్నారు.

ఒలింపిక్స్‌కు ఎలా?
కిమ్‌ రాజీనామా సింధుకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి. హ్యున్‌ కోచ్‌గా కొనసాగే పరిస్థితులు ఏమాత్రం లేనందున.. ఇక ఆమె లేకుండానే ముందుకు సాగాల్సి ఉంటుందని ఒలింపిక్స్‌ రజత పతక విజేత సింధు అభిప్రాయపడింది. ‘ఆమె ఈ దశలో వెళ్లిపోవడం దురదృష్టకరం. కిమ్‌ భర్త త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని తెలుగు షట్లర్‌ పేర్కొంది. హ్యున్‌ రాజీనామా నేపథ్యంలో పురుషుల సింగిల్స్‌ కోచ్‌ పార్ట్‌ టే సంగ్‌ సహాయాన్ని సింధు తీసుకుంటుందని ఆమె తండ్రి రమణ వెల్లడించారు. ‘గత కొద్ది నెలలుగా సింధు పట్ల కిమ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్‌ సెషన్లలో సింఽధు నైపుణ్యాలపై బాగా దృష్టి సారించింది’ అని చెప్పారు.

పూర్తి కాలం కొనసాగని మూడో కోచ్‌..
భారత కోచ్‌గా పూర్తి కాలం కొనసాగని మూడో కోచ్‌ కిమ్‌. గతంలో పురుషుల కోచ్‌గా నియమితుడైన ముల్యో హండోయో (ఇండోనేసియా) కూడా వ్యక్తిగత కారణాలతో 2017లో, అనంతరం మలేసియాకు చెందిన టాన్‌ కిమ్‌ హర్‌ కూడా డబుల్స్‌ కోచ్‌ పదవికి నిర్ణీత సమయానికంటే 18 నెలలు ముందుగా.. ఈ సంవత్సరం ఆరంభంలో రాజీనామా చేశారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD