సింధుతో పృథ్వీ షా సాధన

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-01 05:37:10

img

ముంబై: టీమిండియా ఓపెనర్‌ పృథ్వీ షా త్వరలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుతో కలిసి సాధన చేయనున్నాడు. ఫుట్‌వర్క్‌ మెరుగుపరుచుకోవడంతోపాటు వృత్తి విలువలు పెంపొందించుకొనేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. నిషేధిత డ్రగ్‌ తీసుకొన్నందుకు పృథ్వీ షా ప్రస్తుతం ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం నవంబరు 15న ముగియనుంది. ‘షా ఓవరాల్‌ ఫిట్‌నెస్‌ మెరుగుపడేందుకు, ఫీల్డర్‌గా మరింత సత్తా చాటేందుకు సింధుతో కలిసి ప్రాక్టీస్‌ చేయనున్నాడు’ అని పృథ్వీ కోచింగ్‌ బృందం సభ్యుడొకరు తెలిపాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN