సిఓఏ కమిటీ రద్దు

Prajasakti

Prajasakti

Author 2019-10-24 08:48:42

img

గంగూలీ బిసిసిఐ అధ్యక్షునిగా ఎన్నిక కావడంతో సిఓఏ కమిటీ రద్దు అయ్యింది. 2017 జనవరిలో శ్రీనివాసన్‌పై ఆరోపణలు రావడంతో లోథా సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు వీరిని బిసిసిఐ వ్యవహారాలను పర్యవేక్షించమని నియమించిన సంగతి తెలిసిందే. జనవరి 30, 2017న బాధ్యతలు స్వీకరించిన సిఓఏ కమిటీ సభ్యులు వినోద్‌ రారు, రామచంద్ర గుహ, డయానా ఎడుల్జీ, విక్రమ్‌ లిమాయోలు బిసిసిఐ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు 2014లో గవాస్కర్‌, శివలాల్‌ యాదవ్‌లో బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షులుగా మాత్రమే పనిచేశారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వినోద్‌ రారు పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని జస్టిస్‌ ఆర్‌ఎం లోథా సిఫార్సులు అమలు చేశామని, తమ హయాంలోనే కోహ్లీ- కుంబ్లే, సిఇవో రాహుల్‌ జోహ్రీపై లైంగిక ఆరోపణలు, మహిళల జట్టు కొత్త కోచ్‌ ఎంపిక, మిథాలీ-పవర్‌ వంటి పలు వివాదాలను తాము ఎదుర్కొన్నామన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD