సినిమాల్లో నటించనున్న ప్రముఖ క్రికెటర్లు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-15 10:45:53

img

న్యూఢిల్లీ : భారత దేశానికి చెందిన ప్రముఖ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్‌లు కోలివుడ్‌లో ప్రవేశించనున్నారా? అంటే అవునంటున్నాయి తమిళ సినీవర్గాలు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నిర్మితమవుతున్న ‘విక్రం 58’ సినిమాలో ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. తాను కొత్త వెంచర్‌లో కొత్త సవాళ్ల కోసం ఎదురు చూస్తున్నానని ఇర్ఫాన్ ట్వీట్ చేశారు. తాను సినిమాలో నటిస్తున్నట్లు ఇర్ఫాన్ ధ్రువీకరించారు. మరోవైపు కార్తీక్ యోగి దర్శకత్వంలో నిర్మాణంలో ఉన్న ‘డిక్కీలూనా’ సినిమాలో మరో ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ తొలిసారి నటిస్తున్నారు. తాను తమిళ సినిమాతో పరిచయమవుతున్నట్లు హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి హర్భజన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. పఠాన్ 2012 వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. ఈయన చివరిసారిగా 2012లో టీ ట్వంటీ క్రికెట్ జట్టులో ఆడారు. పఠాన్ 29టెస్టు మ్యాచ్ లలో 100 వికెట్లు తీశారు. హర్భజన్ సింగ్ చివరిసారిగా 2016 లో ఆడారు. 103 టెస్టు మ్యాచ్ లు ఆడిన సింగ్ సినిమాలో నటిస్తున్నారు. 39 ఏళ్ల హర్భజన్ సింగ్ ఐపీఎల్ జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ క్రికెటర్లు సినిమాల్లో నటిస్తుండటంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN