సిరీస్‌పై ఒకరి గురి.. సమం చేయాలని మరొకరి పట్టుదల..!

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-10 00:03:37

img

టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్‌ టేబుల్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా మరో ఫైట్‌కి రెడీ అయింది. ఫ్రీడమ్‌ సిరీస్‌లో మొదటి టెస్ట్‌లో అలవోకగా విక్టరీ కొట్టిన కోహ్లీ సేన.. రెండో మ్యాచ్‌కి సిద్దమైంది. సఫారీ టీమ్‌ సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ నిలవాలన్న కసితో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ టీమిండియాకిది రెండో టెస్ట్‌. 2017లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగడంతో.. ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ టెస్టుని కోహ్లీసేన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

టీమిండియా జట్టులో ఓపెనర్లు రోహిత్‌, మయాంక్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. అరంగేట్రంలోనే ఓపెనర్‌గా చెలరేగిన రోహిత్‌.. ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తే టీమిండియాకి తిరుగుండదు. కోహ్లీ, పుజారా, రహానే స్థాయికి తగ్గట్టు ఆడితే.. సఫారీ టీమ్‌కి కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో టీమిండియా బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. మరోవైపు సఫారీ టీమ్‌కి ఉపఖండపు కష్టాలు తప్పేలా లేవు. వైజాగ్‌ మ్యాచ్‌లో ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించినా.. సఫారీ బ్యాట్స్‌మెన్‌ చివరి రోజు చేతులేత్తేశారు. ఎల్గర్‌, డుప్లెసిస్‌, డికాక్‌ రాణిస్తేనే సఫారీ టీమ్‌ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రొటీస్‌ బౌలింగ్‌ మొదటి మ్యాచ్‌లో పూర్తిగా వైఫల్యమైంది. ముగ్గురి స్పిన్నర్ల వ్యూహాం పూర్తిగా బెడిసి కొట్టింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించనున్నాడు. విరాట్‌ కోహ్లీకి కెప్టెన్‌గా ఇది 50వ మ్యాచ్‌. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో ఇరు జట్లు 37 సార్లు తలపడగా.. టీమిండియా 12 సార్లు గెలవగా, దక్షిణాఫ్రికా 15 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరో పది మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD