సిరెంజ్‌లు కలిగి ఉన్న అథ్లెట్లపై బహిష్కరణ వేటు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-04 06:34:24

  • జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌

గుంటూరు: ‘నో నీడిల్‌ పాలసీ’ని అమలు చేస్తున్న భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) ఇద్దరు అథ్లెట్లను పోటీల నుంచి బహిష్కరించింది. నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న జాతీయ జూనియర్‌ చాంపియన్‌షి్‌ప్సలో సిరెంజ్‌లు, చిన్నచిన్న బాటిల్స్‌ కలిగి ఉన్నందుకు చండీగఢ్‌కు చెందిన ప్రకాష్‌ సింగ్‌, రాజస్థాన్‌కు చెందిన ధనంజను పోటీల నుంచి బహిష్కరించినట్టు ఏఎ్‌ఫఐ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తొలి రోజు పోటీల్లో అండర్‌-20 పురుషుల 10000 మీ. పరుగులో గుర్‌ప్రీత్‌ (హరియాణా), మహిళల 5000 మీ.లో సీమ (హిమాచల్‌ప్రదేశ్‌) విజేతలుగా నిలిచారు. లాంగ్‌జంప్‌లో సంద్రబాబు (కేరళ) 6.16 మీ. దూకి వ్యక్తిగత రికార్డుతో స్వర్ణం సాధించాడు. బాలుర అండర్‌-16 డిస్కస్‌ త్రోలో అరవింద్‌ శర్మ 50.16 మీ. విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీ కోసం అథ్లెట్లకు సంబంధించిన బయోమెట్రిక్‌ కార్డులను ఏఎ్‌ఫఐ అందజేసింది. దీనివల్ల అథ్లెట్ల వయసు తనిఖీలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN