సిల్వర్‌ కపుల్‌ !

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-06 05:52:49

img

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో గురువారం రాత్రి ఆ భార్యభర్తలకు మరపురానిది. ఎందుకంటే ఆ ఇద్దరూ తమతమ విభాగాల్లో రజత పతకాలు గెలుచుకున్నారు కాబట్టి. ఎస్తోనియా డెకాథ్లెట్‌ మైకేల్‌ ఇబో, అతడి భార్య బహామస్‌ రన్నర్‌ షాన్‌ మిల్లర్‌ ఇబో రెండో స్థానంలో నిలిచారు. ‘ఒకేసారి ఇద్దరికీ పతకాలు లభించడం.. వాహ్‌ ఈ రాత్రిని ఎన్నటికీ మరిచిపోలేం’ అని ఆ దంపతులు పేర్కొన్నారు. 2016 రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ మిల్లర్‌ ఐబో.. దోహాలో మహిళల 400 మీటర్ల పరుగులో తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ బహ్రెయిన్‌కు చెందిన సల్వా నాసర్‌... మిల్లర్‌ను కంగుతినిపించి పసిడి పతకం ఎగరేసుకుపోయింది. మిల్లర్‌ ఫినిషింగ్‌ లైన్‌ దాటుతున్న సమయంలో.. మైకేల్‌ డెకాథ్లాన్‌ ఈవెంట్‌లో పదోది, ఆఖరిదైన 1500 మీటర్ల పరుగుకోసం సిద్ధమవుతున్నాడు. 1500 మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచిన 26 ఏళ్ల మైకేల్‌ ఓవరాల్‌గా రజత పతకం సొంతం చేసుకున్నాడు.

తన ఈవెంట్‌కోసం రెడీ అవుతుండడంతో భార్య రేస్‌ను తిలకించలేకపోయానని మైకేల్‌ చెప్పాడు. మిల్లర్‌ కాంస్యం నెగ్గడం ట్రాక్‌పై అడుగుపెట్టేముందు తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపాడు. ఇక తన రేస్‌ పూర్తికాగానే భర్త పాల్గొన్న చివరి ఈవెంట్‌ను మిల్లర్‌ తిలకించింది. ‘పసిడి పతకం వస్తుందని మైకేల్‌ భావించాడు’ అని 25 ఏళ్ల షాన్‌ మిల్లర్‌ పేర్కొంది. ‘అయితే 1500 మీటర్ల పరుగులో అతడు ఆశించిన మేర రాణించలేకపోయాడు. అయినా అతడికి మూడో స్థానం లభించడం గర్వంగా ఉంది’ అని ఆమె చెప్పింది.

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌..

అమెరికాలోని జార్జియా యూనివర్సిటీలో మైకేల్‌, మిల్లర్‌లకు పరిచయం ఏర్పడింది. ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అనతి కాలంలోనే ఒకరంటే ఒకరు వీడిఉండలేని పరిస్థితి ఏర్పడింది. గాఢ ప్రేమలో మునిగిపోయినా చదువుతోపాటు తమ స్పోర్ట్స్‌ కెరీర్‌ను వారు అశ్రద్ధ చేయకపోడం విశేషం. డెకాథ్లాన్‌లో మైకైల్‌, రన్నింగ్‌లో మిల్లర్‌ అద్భుత ప్రతిభ చాటుతూనే 2017లో పెళ్లి చేసుకున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN