సుమిత్‌ నాగల్‌ @129

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-08 05:34:00

img
న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్‌ ప్లేయర్‌ సుమిత్‌ నాగల్‌ కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 22 ఏండ్ల నాగల్‌ 129వ స్థానానికి దూసుకెళ్లాడు. గతవారం ఏటీపీ చాలెంజర్‌ బ్రెజిల్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం ద్వారా నాగల్‌ 6 స్థానాలు మెరుగుపర్చుకొని టాప్‌-100కు మరింత చేరువయ్యాడు. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ తొలిరౌండ్‌లో టెన్నిస్‌ దిగ్గజం ఫెదరర్‌పై ఓ సెట్‌ గెలిచిన నాగల్‌.. ఆ తర్వాత బ్యూనస్‌ ఎయిర్స్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. పురుషుల విభాగంలో జొకోవిచ్‌ (10, 365) టాప్‌ప్లేస్‌లో కొనసాగుతుండగా.. నాదల్‌ (9225), ఫెదరర్‌ (7,130) ఆ తర్వాతి స్థానాలు నిలబెట్టుకున్నారు. మహిళల విభాగంలో ఆష్లే బార్టీ అగ్రస్థానంలోనే ఉంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN