సూపర్ ఓవర్ గండం… ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓటమి

Mana Telangana

Mana Telangana

Author 2019-11-10 18:08:07

img

ఆక్లాండ్: ఇటీవల జరిగిన ప్రపంచకప్ ఫైనల్ తరహాలోనే మరోసారి న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్ జట్లకు సూపర్ ఓవర్ గండం వెంటాడింది. అప్పడు తీవ్ర ఉత్కంఠ మధ్య కివీస్ పై గెలిచిన ఇంగ్లాండ్ జట్టే మళ్లీ ఇప్పుడు కూడా విజయం సాధించింది. దీంతో కివీస్ జట్టుకు సూపర్ ఓవర్ నిరాశనే మిగిల్చింది. ఈడెన్ పార్క్ వేదికగా కివీస్, ఇంగ్లీష్ జట్ట మధ్య జరుగుతున్న ఐదవ టీ20లో ఆదివారం జరిగింది. అయితే, ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ ను 11 ఓవర్లకు కుందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్ మెన్స్  మార్టిన్ గప్తిల్ (50; 21 బంతుల్లో 3 పోర్లు, 5 సిక్స్ లు), కొలిన్ మున్రో (46; 20 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్స్ లు), టిమ్ సైపర్ట్ (39; 16 బంతుల్లో 1 పోర్లు, 5 సిక్స్ లు) మెరుపులు మెరిపించారు.

అనంతరం లక్ష్యఛేదనలో జానీ బెయిర్‌స్టో (47; 18 బంతుల్లో 2 పోర్లు, 5 సిక్స్ లు), శామ్ కరన్ (24; 11 బంతుల్లో 2 పోర్లు, 2 సిక్స్ లు), ఇయన్ మోర్గాన్(17; 7 బంతుల్లో 1 పోర్లు, 2 సిక్స్ లు) చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు కూడా 11 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో ఇరుజట్లను సూపర్ ఓవర్ ఆడించారు. ఈ సూపర్ ఓవర్‌లో ఇంగ్లాండ్ రెండు సిక్స్ లతో మొత్తం 17 పరుగులు చేయగా… కివీస్ మాత్రం ఒక వికెట్ కోల్పోయి కేవలం 8 పరుగులే సాధించడంతో మ్యాచ్ తోపాటు సిరీస్ ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఐదు టీ20ల సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు 3-2తో కైవసం చేసుకుంది.

New Zealand lose T20 Series With 3-2 against England

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN