సూపర్ బౌలర్...సక్లైన్ అరాఫత్ ఓయూ జట్టుకు ఎంపిక

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-06 14:09:43

img

హైదరాబాద్: సూపర్ బౌలర్ సక్లైన్ అరాఫత్ బౌలింగ్ లో తనదైన ప్రతిభ కనబర్చి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే ఉస్మానియా యూనివర్శిటీ(ఓయూ) జట్టులో స్థానం సంపాదించారు. సక్లైన్ అరాఫత్ ఆడనున్న ఓయూ క్రికెట్ జట్టు మైసూర్ యూనివర్శిటీ వేదికగా త్వరలో జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ పురుషుల క్రికెట్ టోర్నీలో పాల్గొననుంది. గత వారం హైదరాబాద్ లో హెచ్ సీఏ ఏ-2 డివిజన్ రెండు రోజుల లీగ్ చాంఫియన్ షిప్ పోటీలో సక్లైన్ అరాఫత్ ఆరు వికెట్లు పడగొట్టి సంచలనం రేపారు. మళ్లీ మంగళవారం హైదరాబాద్ లో జరిగిన హెచ్ సీఏ ఏ -2 రెండురోజుల లీగ్ ఛాంపియన్ షిప్ లో సక్లైన్ మరోసారి నాలుగు వికెట్లు తీసి తన ప్రతిభ చాటుకున్నారు. వరుసగా రెండు వారాల్లో జరిగిన క్రికెట్ పోటీల్లో బౌలింగ్ లో ప్రతిభ కనబర్చిన సక్లైన్ అరాఫత్ హైదరాబాద్ నగరానికి చెందిన గౌస్, నజియా దంపతుల కుమారుడు. తల్లి నజియా ఉస్మానియా యూనివర్శిటీ గ్రంథాలయంలో పనిచేస్తుండగా, ఆమె కుమారుడు ఒయూ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD