సెంచరీతో అదరగొట్టిన సౌతాఫ్రికా కెప్టెన్ మార్కరమ్

Nava Telangana

Nava Telangana

Author 2019-09-28 00:29:00

విజయనగరం: భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కరమ్ సెంచరీతో కదం తొక్కాడు. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో ఇక్కడి డాక్టర్‌ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మార్కరమ్ 118 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ చేశాడు. అయితే, ఆ వెంటనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా రద్దు కాగా, రెండో రోజు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. 23 పరుగుల వద్ద ఓపెనర్ డీన్ ఎల్గర్ (6) అవుటవగా, 33 పరుగుల వద్ద బ్రుయన్ (6) పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న మార్కరమ్ బంతులను బౌండరీలకు తరలిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టనికి 199 పరుగులు చేసింది. ఉమేశ్ యాదవ్, ఇషాన్ పోరెల్ చెరో వికెట్ తీసుకోగా, ధర్మేంద్రసిన్హ్ జడేజా రెండు వికెట్లు తీసుకున్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN