సెంచరీతో చెలరేగిన హిట్ మ్యాన్

V6velugu

V6velugu

Author 2019-10-19 16:33:29

img

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ సెంచరీ చేశాడు. ఓ వైపు 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ వీలు చిక్కినప్పుడు బౌండరీలు బాది సెంచరీ చేసుకున్నాడు. సిక్స్ కొట్టి 131 బంతుల్లో 101 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 13 ఫోర్లు,4 సిక్సులున్నాయి. ఇవాళ 4 సిక్సులతో చెలరేగిన హిట్ మ్యాన్ ఈ ఏడాది టెస్టుల్లో  అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు 16 ఇన్నింగ్స్‌‌‌‌లో 15 సిక్స్‌‌‌‌లు కొట్టిన బెన్‌ స్టో క్స్‌‌‌‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ నాలుగు ఇన్నింగ్స్ ల్లోనే 17సిక్సులు కొట్టడం విశేషం. రోహిత్ శర్మ మొదటి టెస్టులోని రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచరీలు బాదాడు. మరోసారి ఇవాళ మూడో టెస్టులో సెంచరీ చేశాడు. టెస్టుల్లో రోహిత్ కు ఇది 6వ సెంచరీ. అంతేగాకుండా టెస్టుల్లో 2 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు రోహిత్. మరో బ్యాట్స్ మెన్ రహానే నిలకడగా ఆడుతూ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ప్రస్తుతం ఇండియా 49 ఓవర్లు ముగిసే సరికి  మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రోహిత్ 107,రహానే 70పరుగులతో క్రీజులో ఉన్నారు.

img

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD