సెంచరీ తో కదం తొక్కిన విరాట్… భారీ స్కోర్ దిశగా భారత్

Teluguin

Teluguin

Author 2019-10-11 09:21:49

img

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ రెండో మ్యాచ్ లో భారత్ తన దూకుడుని ప్రదర్శిస్తుంది. విరాట్ కోహ్లీ శతకం తో అదరగొట్టాడు. 173 బంతుల్లో 101 పరుగులు చేసిన కోహ్లీ 16 బౌండరీలు బాదాడు. మొత్తానికి టెస్టుల్లో 26 వ శతకంతో అదరగొట్టాడు. అజింక్య రహానే 145 బంతుల్లో అర్ద శతకాన్ని కొట్టాడు. 290 బంతుల్లో 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 109 ఓవర్లు పూర్తయ్యేసరికి 345/3 స్కోరుతో నిలకడగా రానిస్తోంది భారత్.

కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా అద్భుత ప్రదర్శన ని కనబరుస్తున్న విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా తో జరిగే టెస్ట్ సిరీస్ ని గెలిచే విధంగా వ్యూహాత్మక ప్లాన్ ను అమలు చేస్తున్నారు. బాటింగ్ విభాగం తో పాటు, బౌలింగ్, ఫీల్డింగ్ కూడా సరిగ్గా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. భారీ స్కోర్ సాధించే దిశగా టీమిండియా ప్లాన్ చేయడమే కాకుండా అమలు చేస్తూ, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వీరి దూకుడు చూస్తుంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ పునరావృతం అయ్యే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN