సెమీఫైనల్లో సుమిత్‌ నాగల్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-10-06 06:06:07

కాంపినాస్‌ (బ్రెజిల్‌) : భారత టెన్నిస్‌ వర్థమాన ఆటగాడు సుమిత్‌ నాగల్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగుతోంది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో అర్జెంటీనా ఆటగాడు ఫ్రాన్సిస్కోపై 7(6)-6(2), 7-5తో వరుస సెట్లలో నాగల్‌ విజయం సాధించాడు. సుమిత్‌కు ఇది వరుసగా రెండో సెమీఫైనల్స్‌ కావటం విశేషం. నేడు సెమీ సమరంలో అర్జెంటీనాకే చెందిన జాన్‌తో నాగల్‌ పోటీపడనున్నాడు. గత వారం 6-4, 6-2తో అర్జెంటీనా ఆటగాడిపై విజయంతో నాగల్‌ కెరీర్‌ రెండో ఏటీపీ టైటిల్‌ సాధించిన సంగతి తెలిసిందే. యుఎస్‌ ఓపెన్‌లో దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌పై నాగల్‌ ఓ సెట్‌ గెలుపొంది ఆకట్టుకున్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN