సెమీస్‌లో కర్ణాటక, గుజరాత్‌

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-21 06:21:00

img
బెంగళూరు: వరుస విజయాలతో సత్తాచాటిన కర్ణాటక, గుజరాత్‌ జట్లు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌ల్లో కర్ణాటక 8వికెట్ల తేడాతో పుదుచ్చెరిపై విజయం సాధించగా, గుజరాత్‌ 6 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తుచేసింది. కర్ణాటక బౌలర్లు ప్రవీణ్‌ దూబే (3/44), అభిమన్యు మిథున్‌ (2/35) చెలరేగడంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పుదుచ్చెరి టాపార్డర్‌ ఘోరంగా విఫలమమై 41 పరుగలకే ఆరు వికెట్లు కోల్పోయినా.. సాగర్‌ త్రివేది (54), మరిముత్తు (58) అర్ధశతకాలతో రాణించడంతో 50 ఓవర్లలో 207 పరుగులు చేయగలిగింది. లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌ (90) విజృంభించాడు. అతడితో పాటు మరో ఓపెనర్‌ పడిక్కల్‌ (50), రోహన్‌ కదమ్‌ (50నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలు బాదడంతో కర్ణాటక 41 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. వర్షం కారణంగా 49ఓవర్లకు కుదించిన మరో క్వార్టర్స్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 223 పరుగులు చేసింది. స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (0) డకౌటై తీవ్రంగా నిరాశ పరిచినా.. కెప్టెన్‌ ధృవ్‌ షోరే (91) అద్భుతంగా ఆడాడు. లక్ష్యఛేదనలో గుజరాత్‌కు ఓపెనర్లు కెప్టెన్‌ పార్థివ్‌ పటేల్‌ (76), ప్రియాంక్‌ పంచల్‌ (80) అదరగొట్టడంతో ఆ జట్టు 37.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి గెలుపొందింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD