సెమీస్‌లో తమిళనాడు, ఛత్తీస్‌గఢ్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-22 03:09:00

బెంగళూరు : దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ముంబై, పంజాబ్ జట్ల సెమీస్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఛత్తీస్‌గఢ్ - ముంబై, తమిళనాడు - పంజాబ్ మధ్య సోమవారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగగా.. వర్షం కారణంగా రెండూ ఫలితం తేలకుండానే ముగిశాయి. దీంతో లీగ్ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్ల కంటే ఎక్కువ విజయాలు సాధించిన ఛత్తీస్‌గఢ్, తమిళనాడు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. లీగ్ దశ గ్రూప్-సిలో తమిళనాడు తొమ్మిది మ్యాచ్ ల్లో అన్నీ గెలువగా.. ఛత్తీస్‌గఢ్ గ్రూప్-ఏలో ఎనిమిదింట ఐదు మ్యాచ్‌లు గెలిచింది. ముంబై నాలుగు మాత్రమే గెలువడంతో నిష్క్రమించాల్సి వచ్చింది. ముంబైలోని అలూర్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యఛేదనలో వికెట్ నష్టపోకుండా11.3ఓవర్లలోనే 95 పరుగులు చేసిన ముంబై జట్టుకు వరుణుడు పెద్దషాకిచ్చాడు. యువ సంచలనం యశస్వి జైస్వాల్ (60నాటౌట్ల్), ఆదిత్య తారె (31) జోరుగా బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా వర్షం పడి ఎంతకూ ఆగలేదు. దీంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసినట్టు ప్రకటించగా.. సెమీస్ అదృష్టం ఛత్తీస్‌గఢ్‌కు దక్కింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD