సెమీస్‌లో నిఖత్‌, శివ థాపా

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-30 06:19:26

టోక్యో: ఒలింపిక్‌ టెస్ట్‌ ఈవెంట్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ (51 కిలోలు), శివ థాపా (63 కి) సహా ఏడుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి పతకాలు ఖాయం చేసుకున్నారు. నాలుగుసార్లు ఆసియా పతక విజేత శివ క్వార్టర్స్‌ బౌట్‌లో 5-0తో స్థానిక ఫేవరెట్‌ బాక్సర్‌ యుకి హిరకవాను చిత్తుచేశాడు. సెమీ్‌సలో జపాన్‌కే చెందిన డైసుకె నరిమత్సుతో శివ తలపడతాడు. శివ మినహా మిగతా ఆరుగురు భారత బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, సుమిత్‌ సాంగ్వాన్‌ (91 కి), ఆశిష్‌ (69 కి), వాన్లిమ్‌పుయా (75 కి), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కి), పూజా రాణి (75 కి) ఒక్క బౌట్‌ కూడా ఆడకుండానే నేరుగా సెమీస్‌ చేరారు. ప్రత్యర్థుల నుంచి వీళ్లకు తమ రౌండ్లలో బై లభించింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD