సెహ్వాగ్‌కు బర్త్ డే గిఫ్ట్.. అంతలోనే ఔట్

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-20 15:19:13

img

రాంచీ: సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో సిక్సులతో చెలరేగిన ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఔటయ్యాడు. 212 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర పెవిలియన్ చేరాడు. సిక్సుతో డబుల్ సెంచరీ చేసిన రోహిత్‌.. మరో సిక్సుతో భారీ స్కోర్ ఖాయమనిపించాడు. తన ఆరాధ్య క్రికెటర్ సెహ్వాగ్‌కు బర్త్ డే గిఫ్ట్ అన్నట్టుగా సిక్సులతో చెలరేగిన రోహిత్.. రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఫైన్ లెగ్‌లో ఎంగిడి చేతికి చిక్కాడు. జట్టు స్కోర్ 370 పరుగుల దగ్గర ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. పెవిలియన్ చేరుతున్న రోహిత్‌ను సౌతాఫ్రికా ఆటగాళ్లు అభినందించారు. ప్రస్తుతం క్రీజులో జడేజా, సాహా ఉన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN