సోను, రోహిత్ మెరుపులు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-29 06:31:00

-తమిళ్ తలైవాస్‌ను చిత్తుచేసిన గుజరాత్
img
పంచకుల: పాయింట్ల పట్టికలో కింది స్థానాల్లో ఉన్న రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తిరుగులేని విజయం సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 50-21తో తమిళ్ తలైవాస్‌ను చిత్తు చేసింది. సోను (15 పాయింట్లు), రోహిత్ గులియా (11 పాయింట్లు) సూపర్-10లతో సత్తాచాటితే.. ట్యాక్లింగ్‌లో పర్వేశ్ (5 పాయింట్లు) హై ఫై సాధించి గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. తలైవాస్ తరఫున స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 16 రైడ్లలో కేవలం 4 పాయింట్లు మాత్రమే రాబట్టగలిగాడు. మరో సీనియర్ ప్లేయర్ అజయ్ ఠాకూర్ అందుబాటులో లేకపోవడంతో తమిళ తంబీలకు ఓటమి తప్పలేదు. గుజరాత్ జట్టు రైడింగ్‌లో 27 పాయింట్లు సాధిస్తే.. తలైవాస్ 13 మాత్రమే ఖాతాలో వేసుకుంది. ట్యాక్లింగ్‌లో ఫార్చూన్ జెయింట్స్‌కు 16 పాయింట్లు దక్కితే.. తమిళ జట్టు కేవలం 7 పాయింట్లే సాధించింది. దీనికి తోడు తంబీల కోర్టు మూడుసార్లు ఖాళీ కావడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది.

తమిళ్ తలైవాస్ పోటీలో నిలిచింది మ్యాచ్ ఆరంభంమైన తొలి ఐదు నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత నుంచి గుజరాత్ జోరు ప్రారంభమైంది. 10 నిమిషాల్లోపే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన ఫార్చూన్ జెయింట్స్ 11-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం కూడా అదే ఊపు కొనసాగిస్తూ.. 20-9తో ఫస్ట్ హాఫ్‌ను ముగించింది. రెండోసగంలో తంబీలను మరోసారి ఆలౌట్ చేసిన గుజరాత్ 28-11తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇక అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వెళ్లిన ఫార్చూన్ జెయింట్స్ అలవోకగా మ్యాచ్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధా 37-30తో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది.
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN