సౌతాఫ్రికా టెస్టు సీరీస్‌కు బుమ్రా దూరం

Newwaves

Newwaves

Author 2019-09-24 23:58:00

img

విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో టెస్టు సీరీస్‌కు రెడీ అవుతున్న భారత  క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు సీరీస్‌కు జట్టులోని ప్రధాన పేసర్‌ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌కు జట్టులో అవకాశం కల్పించినట్లు బీసీసీఐ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

కాగా.. ఉమేశ్‌ యాదవ్‌ 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా చివరిసారిగా మైదానంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు టెస్టు మ్యాచుల్లో మొత్తంగా 13 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన ఈ పేసర్‌.. టెస్టుల్లో హ్యాట్రిక్‌ తీసిన మూడో భారతీయ బౌలర్‌గా నిలిచాడు.

విశాఖపట్నంలో గురువారం నుంచి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వీసీఏ-ఏడీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగనుంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అనంతరం టెస్టు సీరీస్‌లో భాగంగా భారత్‌- దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు.

టీమిండియా టెస్టు జట్టు ఇదే:
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, ఛటేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మన్ గిల్‌.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD