సౌరవ్ గంగూలీ చేతికి బీసీసీఐ పగ్గాలు

NewsDaily

NewsDaily

Author 2019-10-23 13:58:39

imgThird party image reference

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పగ్గాలు బుధవారమే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేతికిరానున్నాయి. ఇటీవల బోర్డు అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్‌ వేయగా.. అతనికి పోటీగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఈ మాజీ కెప్టెన్ ఎన్నిక లాంఛనమైంది.

బీసీసీఐలో లోధా కమిటీ సిఫార్సుల అమలుపై అలక్ష్యం వహించిన అనురాగ్ ఠాకూర్‌ని 2017 ఆరంభంలో బోర్డు అధ్యక్ష బాధ్యతల నుంచి సుప్రీంకోర్టు తప్పించింది. ఆ తర్వాత బీసీసీఐని నడిపించేందుకు వినోద్ రాయ్ నాయకత్వంలో ఓ పాలకుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. దీంతో బోర్డులో పాలన మొత్తం.. ఆ కమిటీ పర్యవేక్షణలోనే దాదాపు 33 నెలలు సాగింది.

బీసీసీఐ అధ్యక్షుడిగా బుధవారం గంగూలీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలకుల కమిటీ.. బోర్డు నుంచి వైదొలగనుంది. బోర్డులో పాలకుల కమిటీ ఎన్నో సంస్కరణలు చేపట్టింది. కోచ్ నియామకంలో పారదర్శకత, లోధా కమిటీ సిఫార్సుల అమలులో కఠినంగా వ్యవహరించింది. ఈ క్రమంలో రాష్ట్ర క్రికెట్ సంఘాలకి నిధులు ఆపేందుకు కూడా ఆ కమిటీ వెనుకాడలేదు.

భారత్ జట్టుకి దూకుడు నేర్పిన కెప్టెన్‌గా పేరొందిన సౌరవ్ గంగూలీ.. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టీమిండియాని ఫిక్సింగ్ కుంభకోణం కుదిపేస్తున్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన దాదా.. జట్టుని ఒక తాటిపైకి తేవడంలో విజయవంతమయ్యాడు. తాజాగా బీసీసీఐ పాలన కూడా గాడి తప్పినట్లు కనిపిస్తోంది. దీంతో.. గంగూలీ భారత క్రికెట్‌ పాలనలో తన మార్క్ చూపెడతాడేమో..? చూడాలి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD