స్టీవ్ స్మిత్ వీరవిహారం

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-05 03:05:25

img

కాన్‌బెర్రా, నవంబర్ 5: స్టీవెన్ స్మిత్ అద్భుత అర్ధ సెంచరీతో పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలి యా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయ 150 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ బాబర్ అజామ్ (50), ఇఫ్తికర్ అహ్మద్ (62, నాటౌట్) అర్ధ సెంచరీలు సాధించారు. ఆసిస్ బౌలర్లలో ఆస్టాన్ అగర్ 2 వికెట్లు పడగొట్టగా, కేన్ రిచర్డ్‌సన్, ప్యాట్ కమ్మిన్స్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కంగా రులు ఆది నుంచి ధాటిగా ఆడారు. అయతే జట్టు 30 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ (20) అమిర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ (17) కూడా పెవిలియన్‌కు చేరడంతో ఆస్ట్రేలియా 48 పరుగులకే 2 ఓపెనర్లిద్దరినీ కోల్పోయ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులో ఉన్న స్టీవెన్ స్మిత్, బెన్ మెక్‌డెర్మాట్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయతే ధాటిగా ఆడుతు న్న ఈ జోడీని ఇమాద్ వసీం విడగొట్టాడు. 13వ ఓవర్ వేసిన ఇమా ద్ చివరి బంతికి బెన్ మెక్‌డెర్మాట్ (21)ని ఎల్బీగా అవుట్ చేశాడు. అప్పటికే అర్ధ సెంచరీకి చేరువైన స్మిత్ (80, నాటౌట్) ఆస్టాన్ టర్నర్ (8, నాటౌట్) సాయంతో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత చేలరేగి ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లరో మహ్మద్ ఇర్ఫాన్, ఇమాద్ వసీం, మహ్మద్ అమిర్ తలో వికెట్ తీశారు. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ రద్దయన విషయం తెలిసిందే. దీంతో చివరి టీ20 పెర్త్ వేదకగా ఈ నెల 8న జరగనుంది.
ఒకే ఒక విజయం..
ఈ ఏడాది మొత్తం 9 టీ20 మ్యాచ్‌లాడిన పాకిస్తాన్ జట్టు 7 మ్యాచుల్లో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో విజయం సాధిం చగా, ఇంకో మ్యాచ్ ఫలితం తేలలేదు. అలాగే 7 టీ20 మ్యాచ్‌ల తర్వాత మొదటిసారి పాక్ జట్టుపై ఆస్ట్రేలియా విజయం సాధించిం ది. చివరిసారిగా 2018లో హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్‌పై నెగ్గింది.
స్కోర్ బోర్డు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: బాబర్ అజామ్ (రనౌట్/వార్నర్) 50, ఫఖార్ జమాన్ (సీ) వార్నర్ (బీ) ప్యాట్ కమిన్స్ 2, హారిస్ సోహైల్ (సీ,బీ) కేన్ రిచర్డ్‌సన్ 6, మహ్మద్ రిజ్వాన్ (స్టంప్/అలెక్స్ క్యారీ) (బీ) అగార్ 14, అసిఫ్ అలీ (సీ) ప్యాట్ కమిన్స్ (బీ) అగార్ 4, ఇఫ్తికర్ అహ్మద్ (నాటౌట్) 62, ఇమాద్ వసీం (రనౌట్/స్టీవెన్ స్మిత్/స్టార్క్) 11, వాహబ్ రియాజ్ (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 1 మొత్తం: 150 (20 ఓవర్లలో 6 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-22, 2-29, 3-62, 4-70, 5-106, 6-146
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 4-0-25-0, కేన్ రిచర్డ్‌సన్ 4-0-51-1, ప్యాట్ కమిన్స్ 4-0-19-1, ఆడమ్ జంపా 4-0-31-0, ఆస్టన్ అగార్ 4-0-23-2.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (బీ) అమిర్ 20, ఆరోన్ ఫించ్ (సీ) బాబర్ అజామ్ (బీ) ఇర్ఫాన్ 17, స్టీవెన్ స్మిత్ (నాటౌట్) 80, బెన్ మెక్‌డెర్మాట్ (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) ఇమాద్ వసీం 21, ఆస్టాన్ అగార్ (నాటౌట్) 8.
ఎక్స్‌ట్రాలు: 5 మొత్తం: 151 (18.3 ఓవర్లలో 3 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-30, 2-48, 3-106
బౌలింగ్: మహ్మద్ ఇర్ఫాన్ 4-0-27-1, ఇమాద్ వసీం 4-0-34-1, మహ్మద్ అమిర్ 3.3-0-32-1, షాదాబ్ ఖాన్ 4-0-25-0, వాహబ్ రియాజ్ 3-0-33-0.

*చిత్రం... స్టీవ్ స్మిత్ (80, నాటౌట్)

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD