స్పోర్ట్స్‌ కోటా అమలుపై కమిటీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-29 05:37:23

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వృత్తి విద్యా కోర్సుల్లో స్పోర్ట్స్‌ కోటా అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో చెలరేగిన వివాదాల నేపథ్యంలో మరోసారి అలాంటివి తలెత్తకుండా జీవో నెంబర్‌ 7లో అవసరమైన మార్పులు చేసి వచ్చే ఏడాది నుంచి వాటిని అమ లు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఆ దిశగా కార్యచరణ ప్రారంభించింది. ఈ కమిటీకి శాట్స్‌ ఎండీ అధ్యక్షత వహిస్తారు. గతంలో ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం ప్రతినిధికి చోటు కల్పించేవారు. ఈసారి అలా చేయకపోవడంతో క్రీడాకారులు గొంతు వినిపించేందుకు ఆస్కారం లేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD